తమిళనాడులో దూడ వింత ప్రవర్తన | Villages sway to the tunes of musically-inclined calf | Sakshi
Sakshi News home page

మనిషి గుణాలతో దూడ

May 2 2019 4:41 AM | Updated on May 2 2019 8:12 AM

Villages sway to the tunes of musically-inclined calf - Sakshi

వేలూరు: తమిళనాడులో ఒక దూడ వింతగా ప్రవర్తిస్తోంది. మనిషి గుణాలు కలిగి ఉందా అన్నట్లు ప్రవర్తిస్తోంది. వేలూరు జిల్లా ఆంబూరులోని వీరాంకుప్పంకు చెందిన ఆనందన్‌కు చెందిన ఆవు ఇటీవల మగ దూడకు జన్మనిచ్చింది. ఈ దూడ రాత్రి వేళల్లో ఇంట్లోకి ప్రవేశించి చాప, దిండు ఉన్న చోట నిద్రిస్తోంది. ఇంట్లోని నీళ్లు తాగడం, చిన్నారుల కోసం తీసుకొచ్చిన తిను బండారాలను తింటూ వారితో కలిసి తిరుగుతోంది. దీంతో కుటుంబ సభ్యులు ఫ్యాన్, పాటలు వినేందుకు టేప్‌ రికార్డర్‌తో పాటు స్పీకర్లు ఏర్పాటు చేశారు. ఈ దూడ సినిమా పాటలకు డాన్స్‌ కూడా చేస్తోంది. ఆకలి వేసినప్పుడు మాత్రమే తల్లి ఆవు వద్దకు వెళుతోంది. దీంతో ఈ దూడకు వేలన్‌ అనే పేరు పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement