జల వనరుల మంత్రిత్వశాఖకు నిధుల కోత | very less funds for water resources ministry | Sakshi
Sakshi News home page

జల వనరుల మంత్రిత్వశాఖకు నిధుల కోత

Mar 1 2015 7:14 AM | Updated on Sep 2 2017 10:05 PM

జల వనరుల మంత్రిత్వశాఖకు నిధుల కోత

జల వనరుల మంత్రిత్వశాఖకు నిధుల కోత

బడ్జెట్‌లో జల వనరుల మంత్రిత్వశాఖకు నిధుల్లో భారీ కోత పడింది.

న్యూఢిల్లీ: బడ్జెట్‌లో జల వనరుల మంత్రిత్వశాఖకు నిధుల్లో భారీ కోత పడింది. ఈ శాఖకు ప్రస్తుత బడ్జెట్‌లో రూ.4.232.43 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇందులో సింహభాగం నిధులను మోదీ ప్రభుత్వ మానస ప్రాజెక్టు అయిన ‘గంగా నది ప్రక్షాళన’కు ఇవ్వడం విశేషం. గంగానది ప్రక్షాళన ప్రణాళికకు  రూ.2,100 కోట్లు కేటాయించారు. 2014-15కు సంబంధించిన సవరించిన బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ.600 కోట్లు అదనం. పోలవరం ప్రాజెక్టు అథారిటీ కోసం రూ.100 కోట్ల నిధులను కేటాయించారు. నదుల అనుసంధానంపై సవివర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) రూపకల్పనకు రూ.100 కోట్లు కేటాయించారు.

Advertisement
 
Advertisement
Advertisement