నాలుగో సెట్‌ నామినేషన్‌ దాఖలు చేసిన కోవింద్‌ | Venkaiah యaidu files fourth set of nomination papers on behalf of NDA presidential candidate | Sakshi
Sakshi News home page

నాలుగో సెట్‌ నామినేషన్‌ దాఖలు చేసిన కోవింద్‌

Jun 28 2017 11:34 AM | Updated on May 29 2018 2:55 PM

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్ బుధవారం మరో దఫా నామినేషన్ దాఖలు చేశారు.

న్యూఢిల్లీ: : ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్ బుధవారం మరో దఫా నామినేషన్ దాఖలు చేశారు. నాలుగో సెట్‌ నామినేషన్ పత్రాలను ఆయన తరఫున బీజేపీ నేత, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు  ఇవాళ రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. గత శుక్రవారమే రాష్ట్రపతి ఎన్నికల కోసం కోవింద్‌ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. 

వెంకయ్య నాయుడు ఈరోజు ఆఖరి సెట్‌ను రిటర్నింగ్‌ అధికారికి అందించారు. ఈ నామినేషన్‌ కార్యక్రమానికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి హాజరయ్యారు. నాలుగోసెట్‌ నామినేషన్ పత్రాలపై ఆయన సంతకాలు చేశారు. రామ్‌నాథ్‌ కోవింద్‌ అభ్యర్థిత్వానికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ  సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ రాష్ట్రపతి పదవికి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్ని విధాలా అర్హుడన్నారు. అత్యధిక మెజార్టీతో రామ్‌నాథ్‌ గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement