
పిల్లల్లో స్థూలకాయం, రక్తహీనత తదితర అనారోగ్య సమస్యలను నివారించేందుకు తీసుకోదగిన చౌకైన పౌషకాహారంపై..
న్యూఢిల్లీ: పిల్లల్లో స్థూలకాయం, రక్తహీనత తదితర అనారోగ్య సమస్యలను నివారించేందుకు తీసుకోదగిన చౌకైన పౌషకాహారం గురించి ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల నిధి (యునిసెఫ్) తన బుక్‌లెట్‌లో పేర్కొంది. ఊతప్పం నుంచి మొలకెత్తిన గింజలతో చేసిన పరోఠాల దాకా రకరకాల పౌష్టికాహారాన్ని తన బుక్‌లెట్‌లో సూచించింది. యునిసెఫ్ సర్వే ప్రకారం అయిదేళ్ల వయస్సులోపు పిల్లల్లో 35 శాతం మంది ఎదుగుదల లోపంతో, యుక్తవయస్సులోని బాలికల్లో 40 శాతం మంది, బాలల్లో 18 శాతం రక్తహీనత సమస్య ఉంటోందని వెల్లడైంది.
పిల్లల్లో తక్కువ బరువు సమస్యను అధిగమించేందుకు ఆలూ పరాఠా, పనీర్ కఠి రోల్, సగ్గుబియ్యం కట్‌లెట్ వంటివి.. స్థూలకాయ సమస్య నివారణకు మొలకెత్తిన పప్పుగింజలతో పరాఠాలు, పోహా, ఉప్మా మొదలైన ఆహారం అందించవచ్చని సూచించింది.