చత్తీస్‌గఢ్‌లో అమెరికా వాసి అదృశ్యం | US citizen went missing in chattisgarh, police suspect kidnapping | Sakshi
Sakshi News home page

చత్తీస్‌గఢ్‌లో అమెరికా వాసి అదృశ్యం

Mar 28 2017 11:28 AM | Updated on Aug 24 2018 4:46 PM

చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో అమెరికా పౌరుడు కనిపించకుండాపోయాడు.

హైదరాబాద్‌: చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో అమెరికా పౌరుడు కనిపించకుండాపోయాడు. ఇమిగ్రేషన్‌ రెఫ్యూజీస్‌ అండ్‌ సిటిజన్‌షిప్‌, కెనడా(ఐఆర్‌సీసీ)కు చెందిన అమెరికా పౌరుడు జాన్‌ ఈ నెల 14వ తేదీన ముంబై నుంచి బైక్‌పై చత్తీస్‌గఢ్‌కు ప్రయాణం ప్రారంభించాడు. సాయంత్రానికి సుక్మా జిల్లా సింగమడుగు గ్రామ సమీపంలో వద్ద కనిపించకుండాపోయాడు.

మావోయిస్టులు పట్టుకలిగిన జిల్లా కావడంతో జాన్‌ను మావోయిస్టులే కిడ్నాప్‌ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. జాన్‌కు సంబంధించిన వివరాలను ముంబైలోని ఆయన ట్రావెల్‌ ఏజెంట్‌ వద్ద నుంచి సేకరిస్తున్నారు. అయితే, జాన్‌ అపహరణపై పోలీసులు ఎలాంటి ధ్రువీకరణ చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement