2లక్షల 40 వేలు : మయన్మార్‌ను వీడిన చిన్నారులు | UNICEF estimates 240,000 children fled Myanmar | Sakshi
Sakshi News home page

బంగ్లాకు రోహింగ్యా చిన్నారుల వలస

Sep 15 2017 6:28 PM | Updated on Sep 19 2017 4:36 PM

2లక్షల 40 వేలు : మయన్మార్‌ను వీడిన చిన్నారులు

2లక్షల 40 వేలు : మయన్మార్‌ను వీడిన చిన్నారులు

మయన్మార్‌లో నెలకొన్న నేపథ్యంలో భారీగా రోహింగ్యాలు బంగ్లా వలసబాట పట్టారు.

సాక్షి : మయన్మార్‌లో నెలకొన్న వివాద పరిస్థితుల నేపథ్యంలో భారీగా రోహింగ్యాలు బంగ్లా వలసబాట పట్టారు. గత మూడు వారాల్లోనే సుమారు 2 లక్షల 40 వేల మంది రోహింగ్యా చిన్నారులు బంగ్లాకు వలస వెళ్లినట్లు ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్‌ ప్రకటించింది. మయన్మార్‌లో బౌద్ధులకు-రోహింగ్యాలకు మధ్య అత్యంత దారుణ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.

చిన్నారుల వలసలపై యూనిసెఫ్‌ అధికార ప్రతినిధి మారిక్సీ మెర్కాడో మాట్లాడుతూ.. ఇప్పటివరకూ 60 శాతం మంది రోహింగ్యాలు అంటే 3 లక్షల 91 వేల మంది వలస వెళ్లినట్లు చెప్పారు.  ఇందులో ఏడాదిలోపు ఉన్న చిన్నారుల సంఖ్య 36 వేలు, అలాగే గర్భవతుల సంఖ్య 52 వేలు ఉందని మారిక్సీ అన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement