ఇక ఆధార్‌ సేవా కేంద్రాలు

UIDAI To Set Up Aadhaar Seva Kendras - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాల తరహాలో దేశవ్యాప్తంగా ఆధార్‌ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు యూఐడీఏఐ సన్నాహాలు చేస్తోంది. ఆధార్‌ సేవా కేంద్రాల్లో ఆధార్‌ నమోదు, అప్‌డేట్‌ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆధార్‌ కార్డుల రాజ్యాంగ చెల్లుబాటుపై సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెలువరించిన అనంతరం యూఐడీఏఐ ఈ మేరకు సన్నాహాలు చేపట్టింది.

రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే ఆధార్‌ నిబంధనలున్నాయని గతంలో అప్పటి సర్వోన్నత న్యాయస్ధానం ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం బెంచ్‌ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆధార్‌ను బ్యాంకింగ్‌, మొబైల్‌ సేవలు, స్కూల్‌ అడ్మిషన్లకు అనివార్యం చేయరాదని పేర్కొంది. ఆధార్‌తో పాన్‌ అనుసంధానాన్ని తప్పనిసరి చేసిం‍ది.

పౌరుల ఆధార్‌ వివరాలను ప్రైవేట్‌ కంపెనీలు కోరరాదని తేల్చిచెప్పింది. ఇక ఆధార్‌ సేవా కేంద్రాల్లో నూతన ఆధార్‌ కార్డుల నమోదుతో పాటు మార్పులను కూడా చేపడతారు. ఆన్‌లైన్‌ ద్వారా అపాయింట్‌మెంట్‌ చేసుకుని సంబంధిత పత్రాలతో నిర్ధిష్ట తేదీ, సమయంలో హాజరై అవసరమైన సేవలు పొందవచ్చని అధికారులు పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top