కశ్మీర్‌ ఎన్‌కౌంటర్‌ : ఇద్దరు ఉగ్రవాదుల మృతి

Two Terrorists Killed As Gunfight Resumes In Bandipora   - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్‌లోని బండిపర జిల్లాలో సోమవారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో  ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. మరోవైపు ఇదే ప్రాంతంలో ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు తలదాచుకుని ఉంటారన్న సమాచారంతో భద్రతా దళాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఉగ్ర కదలికలపై సమాచారం అందుకున్న భద్రతా దళాలు బండిపర జిల్లాలోని లదౌర ప్రాంతంలో ఉగ్రవాదులను గుర్తించి కాల్పులకు తెరపడ్డాయి. భద్రతా దళాలను చూసి ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడగా, భద్రతా దశాలు ఎదురుకాల్పులకు దిగాయి. భద్రతా దళాల ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. కాగా మూడువారాల కిందట అవంతిపురలో భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top