కుప్పకూలిన రెండు జెట్‌ విమానాలు : పైలట్‌ మృతి | Two Surya Kiran aircraft crash during Aero Show prep in Bengaluru  | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన రెండు జెట్‌ విమానాలు : పైలట్‌ మృతి

Feb 19 2019 12:25 PM | Updated on Feb 19 2019 4:39 PM

Two Surya Kiran aircraft crash during Aero Show prep in Bengaluru  - Sakshi


బెంగళూరు : సైనిక వైమానిక దళ విన్యాసాల్లో అపశృతి చోటు చేసుకుంది. బెంగళూరులోని యలహంక ఎయిర్‌ బేస్‌ వద్ద రెండు ఐఏఎఫ్ జెట్‌ విమానాలు ఒకదానికొకటి ఢీకొని  కుప్పకూలాయి. సూర్యకిరణ్‌ ఏరోబేటిక్స్‌ బృందం రిహార్సల్స్‌  నిర్వహిస్తుండగా  మంగళవారం ఈ దుర్ఘటన జరిగింది.  గాలిలోనే  ఈ  రెండు జెట్లు కాలి బూడిదైనట్టు ప్రత్యక్ష సాక్షుల కథనం.  ఈప్రమాదంలో ఒక పైలట్‌ దుర్మరణం చెందగా మిలిగిన  ఇద్దరు పైలట్లు సురక్షితంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి   ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement