కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు మిలిటెంట్లు మృతి | Two Militants Died By Security Forces In Anantnag District | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు మిలిటెంట్లు మృతి

Feb 22 2020 9:42 AM | Updated on Feb 22 2020 9:42 AM

Two Militants Died By Security Forces In Anantnag District - Sakshi

ఫైల్‌ ఫోటో

కశ్మీర్‌: జమ్మూ- కశ్మీర్‌తో కాల్పుల మోత మోగింది. దక్షిణ కశ్మీర్‌ అనంత్‌నాగ్‌ జిల్లాలోని గుండ్‌బాబా సంగంలో భద‍్రతా దళాలకు లష్కరే తొయిబా మిలిటెంట్లకు మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో  ఇద్దరు మిలిటెంట్లు మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. మిలిటెంట్లు సంచరిస్తున్నారన్న సమాచారంతో భద్రతా దాళాలు కార్డెన్‌ సెర్చ్ చేపట్టారు.

ఈ క్రమంలో భద్రతా దళాలకు, మిలిటెంట్లకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మిలిటెంట్లు మృతి చెందినట్లు ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ విజయ్‌ కుమార్‌ తెలిపారు. మృతి చెందిన వారిలో లష్కరే తొయిబా మిలిటెంట్ల స్థానిక కమాండర్ ఫుర్కాన్‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాల్పులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement