నాకూ వేధింపులు తప్పలేదు!: ఎంపీ

Trinamool MP Derek O Brien Recounts Trauma - Sakshi

న్యూఢిల్లీ: ‘అప్పుడు నాకు 13 ఏళ్లు. కోల్‌కతాలో టెన్నిస్‌ ప్రాక్టీస్‌కు వెళ్లి తిరిగి వస్తున్నా. నిక్కర్, టీ షర్ట్‌ వేసుకుని ఉన్నా. ఇంటికి వెళ్లేందుకు చాలా రద్దీగా ఉన్న బస్‌ ఎక్కాను. ఎవరో తెలీదు. కానీ నన్ను ఆ రద్దీలో నన్ను లైంగికంగా వేధించారు. కొన్నేళ్ల తరువాత ఒక సందర్భంలో మా ఇంట్లో చెప్పాను’.. ఈ వ్యాఖ్యలు చేసింది తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ, ప్రఖ్యాత క్విజ్‌ మాస్టర్‌ డెరెక్‌ ఓ బ్రెయిన్‌. పోక్సో (లైంగిక వేధింపుల నుంచి చిన్నారులను రక్షించే చట్ట సవరణ) బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన రాజ్యసభలో ఈ బాధాకర విషయాన్ని గుర్తు చేసుకున్నారు. పిల్లలపై దారుణంగా లైంగిక నేరానికి పాల్పడినవారికి మరణశిక్ష విధించేలా ప్రతిపాదన ఉన్న ఈ బిల్లుకు డెరెక్‌ మద్దతు తెలిపారు. మిగతా పార్టీల సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఈ బిల్లుకు మద్దతు ప్రకటించారు. బిల్లులోని సవరణలను కాంగ్రెస్‌ పార్టీ స్వాగతించింది.

లోక్‌సభకు బిల్లు
పిల్లలపై తీవ్రమైన లైంగిక నేరాలకు మరణ శిక్ష, మైనర్లపై లైంగిక  నేరాలకు ఇతర తీవ్రస్థాయి శిక్షలకు అవకాశం కల్పించేలా ఈ బిల్లులో ప్రతిపాదనలున్నాయి. చర్చకు సమాధానమిస్తూ పోక్సో సంబంధిత 1.66 కోట్ల పెండింగ్‌ కేసుల విచారణకు 1023 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు మహిళ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top