తృణమూల్‌ కార్యకర్త దారుణ హత్య..!

Trinamool Congress Activists Dies In Brutal Attack In Kolkata - Sakshi

కోల్‌కత : తృణమూల్‌ కార్యకర్త ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. హుగ్లీ జిల్లా నకుందాలో నివాసముండే లాల్‌చంద్‌ బాగ్‌ (40) మార్కెట్‌కు వెళ్లి వస్తుండగా మాటువేసిన దుండగులు దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన లాల్‌చంద్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన సోమవారం జరిగింది. లాల్‌చంద్‌ తండ్రి  ఫిర్యాదు మేరకు 27 మందిపై కేసు నమోదు చేశామని, ఆరుగురిని అరెస్టు చేశామని ఎస్పీ తథాగత బసు తెలిపారు. మిగతా వారికోసం గాలింపు ముమ్మరం చేశామని వెల్లడించారు. కాగా, ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యనని బీజేపీ ఆరోపిస్తోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ర్యాలిలో పాల్గొన్నందుకే తమ కార్యకర్తను అతి దారుణంగా కొట్టి చంపారని టీఎంసీ జిల్లా నాయకుడు దిలీప్‌ యాదవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter | తాజా సమాచారం కోసం డౌన్ లోడ్ చేసుకోండి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top