మే 3 తర్వాత విమాన సర్వీసులు నడుస్తాయా!

Trains And Flights Unlikely To Resume After Lockdown - Sakshi

ఢిల్లీ : కరోనా వైరస్‌ వ్యాప్తిని నిలువరించడానికి దేశంలో విధించిన లాక్‌డౌన్‌ మే 3న ముగియనున్నప్పట్టికీ రైలు, విమాన సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడంలేదు. దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే భౌతిక దూరం పాటించడం తప్పనిసరి కావడంతో రైలు, విమానయాణం మళ్లీ ప్రారంభమవుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎయిర్‌ ఇండియా తన దేశీయ విమాన సర్వీసులను మే 4 నుంచి, అంతర్జాతీయ విమాన సర్వీలును జూన్‌ 1 నుంచి నడపనుందని, వాటికి సంబంధించి బుకింగ్‌ ఇప్పటికే ప్రారంభించిందని శనివారం వార్తలు వచ్చాయి. (కరోనా: ఒక్కరోజే 1334 మందికి పాజిటివ్‌)

ఈ మేరకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో జరిగిన గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్‌ (జీఓఎం) సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగిందని, తాము రైల్వే, విమాన సర్వీలుసులను మే 3 తర్వాత నడపాలని ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు టికెట్‌ బుకింగ్‌ చేపట్టవద్దని అధికారులకు సూచించామని సంబంధిత మంత్రిత్వ శాఖలు పేర్కొన్నట్లు సమాచారం. ఈ విషయంలో కేంద్ర ఆరోగ్య శాఖ తీసుకునే నిర్ణయంపైనే  తదుపరి చర్యలు ఆదారపడి ఉంటాయని అభ్రిప్రాయపడినట్లు తెలిసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top