
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలోని వసంత కుంజ్ వంటి కొన్ని ప్రాంతాల్లో ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకున్నారు. ఈరోజు సాయంత్రం నుంచి వాతావరణంలో తేమస్థాయి తగ్గడంతో నగర ప్రజలు ఉపశమనం పొందారు. ఢిల్లీకి దక్షిణ దిక్కు నుంచి వర్షపు మేఘాలు సమీపిస్తున్నాయి. అదే విధంగా గురుగ్రామ్, ఫరిదాబాద్‌లో మోస్తరు వర్షం కురుస్తోందని.. దీంతో పాటు ఢిల్లీ, చండీగఢ్, పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌ల్లో భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతవరణశాఖ ఆదేశాలు జారీచేసింది.