ఒక్కరోజులో 6,767 కేసులు

Total corona virus cases in india is 6767 - Sakshi

భారత్‌లో పంజా విసురుతున్న కరోనా రక్కసి 

గత 24 గంటల్లో 147 మంది బాధితులు మృతి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. లాక్‌డౌన్‌ అమల్లో ఉండగానే పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. కేసుల విషయంలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. వరుసగా మూడో రోజు భారీగా కేసులు బయటపడ్డాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు.. కేవలం ఒక్కరోజు వ్యవధిలో ఏకంగా 6,767 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇండియాలో కరోనా ఆనవాళ్లు బయటపడిన తర్వాత ఇప్పటిదాకా ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే గరిష్టం కావడం గమనార్హం.

అలాగే గత 24 గంటల్లో 147 మంది కరోనా బాధితులు మరణించారు. అంటే గంటకు ఆరుగురు మృతి చెందినట్లు స్పష్టమవుతోంది.  ఇప్పటివరకు మొత్తం పాజిటివ్‌ కేసులు 1,31,868కు, మరణాలు 3,867కు చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. భారత్‌లో ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసులు 73,560కి ఎగబాకాయి. 54,440 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారు. రికవరీ రేటు 41.28 శాతానికి చేరడం కొంత సానుకూలాంశంగా మారింది.  

రాబోయే 2 నెలలు అత్యంత కీలకం
ప్రాణాంతక కరోనా వైరస్‌ తీవ్రత ఇప్పటికే అధికంగా ఉన్న ప్రాంతాల్లో రాబోయే రెండు నెలలు అత్యంత కీలకమని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలను మరింత పెంచుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆక్సిజన్‌ వసతితో కూడిన ఐసోలేషన్‌ బెడ్లు, వెంటిలేటర్లు, ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.

దేశంలో ఇప్పటిదాకా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో 70 శాతం కేసులు మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్తాన్‌ రాష్ట్రాల్లోని 11 మున్సిపాల్టీలు/కార్పొరేషన్లలోనే బయటపడ్డాయని తెలియజేసింది. ఆయా ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, జనసాంద్రత అధికంగా ఉన్నచోట ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయాలని స్థానిక అధికారులకు సూచించింది. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతీ సుదాన్‌ శనివారం 11 మున్సిపాల్టీలు/కార్పొరేషన్ల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా నియంత్రణకు స్క్రీనింగ్‌ పరీక్షలు అధికంగా నిర్వహించాలని ఆదేశించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

15-07-2020
Jul 15, 2020, 11:35 IST
సాక్షి, బెంగుళూరు: దేశవ్యా‍ప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో...
15-07-2020
Jul 15, 2020, 11:27 IST
ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కరోనాకు ఉచితంగా చికిత్స అందించాలని నిర్ణయం తీసుకుంది.
15-07-2020
Jul 15, 2020, 10:42 IST
కర్నూలు(హాస్పిటల్‌): కరోనా బాధితుల వివరాలు నమోదు చేయడంలో తప్పులు దొర్లుతున్నాయి. ప్రధానంగా ఒకే పేరు గల వ్యక్తుల సమాచారం నివేదించడంలో...
15-07-2020
Jul 15, 2020, 10:26 IST
వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవలి వివాదాస్పద నిర్ణయంపై  వెనక్కి తగ్గారు. ఆన్‌లైన్‌ క్లాస్‌లకు హాజరవుతున్న విదేశీ విద్యార్థులకు...
15-07-2020
Jul 15, 2020, 10:23 IST
కడప అర్బన్‌ :  కరోనా నియంత్రణ నేపథ్యంలో పోలీసుశాఖ అహర్నిశలు కృషి చేస్తోంది. ఈ క్రమంలో విధులు నిర్వర్తిస్తున్న దాదాపు...
15-07-2020
Jul 15, 2020, 09:39 IST
సాక్షి, తిరుపతి : నెలలు నిండిన గర్భిణి డెలివరీ కోసం ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. కరోనా టెస్ట్‌ చేయించుకొస్తేనే అడ్మిట్‌...
15-07-2020
Jul 15, 2020, 09:13 IST
ప్రపంచమంతా కరోనాతో చిగురుటాకులా వణికిపోతోంది. ఈ మాయదారి వైరస్‌ మన జిల్లాలోనూ కోరలు చాస్తోంది. ఎందరినో కబళిస్తోంది. ఎన్నో కుటుంబాలను...
15-07-2020
Jul 15, 2020, 08:47 IST
సాక్షి, గాంధీనగర్‌: ప్రముఖ ఔషధ తయారీ సంస్థ లుపిన్‌కు కరోనా మహమ్మారి సెగ తాకింది. గుజరాత్, అంకలేశ్వర్‌లోని సంస్థకు చెందిన తయారీ ప్లాంట్‌లో సిబ్బందికి...
15-07-2020
Jul 15, 2020, 07:58 IST
సాక్షి, కృష్ణా: గుడివాడ పట్టణంలో కరోనా పరీక్షలు చేసేందుకు బుధవారం ఉదయం ప్రత్యేక బస్సు రానున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాలు,...
15-07-2020
Jul 15, 2020, 07:26 IST
తాండూరు టౌన్‌: పీపీఈ కిట్‌ చెత్తకుప్పలో కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కోవిడ్‌ పాజిటివ్‌ వ్యక్తులు లేదా వారికి...
15-07-2020
Jul 15, 2020, 07:18 IST
కరోనా.. ఆ పేరు వింటేనే పెద్దల నుంచి మొదలుకుని చిన్నారుల వరకూ చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. కోవిడ్‌ టెస్ట్‌ సైతం చిన్నారులను...
15-07-2020
Jul 15, 2020, 07:08 IST
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో 6 జోన్లు.. 30 సర్కిళ్లు.. 150 వార్డులున్నాయి. నగరంలో కోవిడ్‌– 19 కేసుల...
15-07-2020
Jul 15, 2020, 06:32 IST
సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్‌ రోగుల చికిత్సకు ఉపకరించే యాంటీ వైరల్‌ ఔషధాలను బ్లాక్‌ మార్కెట్‌ చేసి, అధిక ధరలకు విక్రయిస్తున్న...
15-07-2020
Jul 15, 2020, 05:52 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా విజృంభిస్తుండటంతో రాష్ట్రంలో ఆక్సిజన్‌ సిలిండర్లకు కొరత ఏర్పడింది. మున్ముందు అవసరం అవుతుందన్న భావనతో అనేక మంది ముందస్తుగా...
15-07-2020
Jul 15, 2020, 04:29 IST
కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటం, దక్షిణ చైనా సముద్రం విషయమై అమెరికా–చైనాల మధ్య తాజాగా ఉద్రిక్తతలు చెలరేగడంతో ప్రపంచ మార్కెట్లతో...
15-07-2020
Jul 15, 2020, 03:53 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా పరీక్షలు 12 లక్షలకు చేరువయ్యాయి. ఇప్పటివరకు 11,95,766 టెస్టులు చేశారు. ఈ మేరకు రాష్ట్ర...
15-07-2020
Jul 15, 2020, 03:50 IST
వాషింగ్టన్‌: కోవిడ్‌ –19 కబంధ హస్తాల్లో చిక్కుకొని అగ్రరాజ్యం అమెరికా విలవిలలాడుతుంటే అక్కడ యువతరం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోంది. కరోనా పార్టీలు...
15-07-2020
Jul 15, 2020, 03:05 IST
బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్, ఆయన తనయుడు అభిషేక్‌ కరోనా పాజిటివ్‌తో ముంబై నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి...
15-07-2020
Jul 15, 2020, 02:00 IST
సాక్షి, హైదరాబాద్ ‌: మన దేశంలో ప్రతీ 10 వేల జనాభాకు ఎనిమిది మంది కంటే కొంచెం తక్కువగానే డాక్టర్లు...
15-07-2020
Jul 15, 2020, 01:44 IST
సాక్షి, హైదరాబాద్ : ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌ బోధన రెండు సెషన్‌లు చాలని, ప్రీప్రైమరీ తరగతులకు...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top