జాతీయ జెండాను అవమానిస్తే మూడేళ్ల జైలు | Three years jail for insulting of national flag | Sakshi
Sakshi News home page

జాతీయ జెండాను అవమానిస్తే మూడేళ్ల జైలు

Apr 11 2016 2:17 AM | Updated on Aug 20 2018 9:16 PM

జాతీయ గీతాన్ని, జాతీయ పతాకాన్ని అవమానపర్చడం... వాటిని అగౌరవపరుస్తూ సభల్లో ప్రసంగించడంలాంటి ఘటనలపై కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది.

న్యూఢిల్లీ: జాతీయ గీతాన్ని, జాతీయ పతాకాన్ని  అవమానపర్చడం... వాటిని అగౌరవపరుస్తూ సభల్లో ప్రసంగించడంలాంటి ఘటనలపై కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. ఇలాంటి ఘటనలు నిజమని నిర్ధారణ అయితే మూడేళ్ల జైలు శిక్ష విధించాలని పేర్కొంది.

ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సమాచారం అందించింది. జాతీయ గీతం, జెండా ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పింది. ‘ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు ది నేషనల్ హానర్ యాక్ట్ 1971’, ‘ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా, 2002’కు సంబంధించిన కాపీలను రాష్ట్రాలకు పంపింది. జేఎన్‌యూ ఘటన నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు చర్యలు చేపట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement