కెల్లార్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

Three Terrorists Killed In Encounter At Keller Area Of Shopian - Sakshi

శ్రీనగర్‌: షోపియాన్‌ జిల్లాలోని కెల్లార్‌ ప్రాంతంలో గురువారం ఉదయం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. సీఆర్పీఎఫ్‌, ఆర్మీ బలగాలు సంయుక్తంగా కెల్లార్‌ ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాదులకు ధీటుగా బదులిచ్చారు. ఘటన స్థలం నుంచి భద్రతా బలగాలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఉగ్ర కదలికలపై ఆర్మీ బలగాలు ఇంకా సెర్చ్‌ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top