ఆన్లైన్లో దుమ్మురేపుతున్న సెల్ఫీ | This Man Clicked A Selfie With A Smiling Sloth And It's Breaking The Internet | Sakshi
Sakshi News home page

ఆన్లైన్లో దుమ్మురేపుతున్న సెల్ఫీ

Jul 6 2016 10:36 AM | Updated on Sep 4 2017 4:16 AM

ఆన్లైన్లో దుమ్మురేపుతున్న సెల్ఫీ

ఆన్లైన్లో దుమ్మురేపుతున్న సెల్ఫీ

స్లాత్స్.. ఇవి చాలా అరుదుగా కనిపించి అటవీ జంతువులు. ఎప్పుడు నిద్రమత్తులో ఉండి బద్ధకంగా ఉంటుంటాయి. మిగితా జంతువుల కంటే భిన్నంగా చెట్లకు వేలాడుతుంటాయి.

స్లాత్స్.. ఇవి చాలా అరుదుగా కనిపించి అటవీ జంతువులు. ఎప్పుడు నిద్రమత్తులో ఉండి బద్ధకంగా ఉంటుంటాయి. మిగితా జంతువుల కంటే భిన్నంగా చెట్లకు వేలాడుతుంటాయి. అది కూడా రెండు కాళ్లు చెట్టుకొమ్మకు మెలేసి ఓ చేతిని కిందకి వేలాడేసి మరో చేత్తో ఆ చెట్టుకొమ్మను పట్టుకొని.. ఇవి ఎట్టి పరిస్థితుల్లో నేలపై అడుగుపెట్టవు. ఒక చెట్టుమీద నుంచి మరో చెట్టుమీదకు కొమ్మలద్వారా వెళుతుంటాయి. అది కూడా మన్ను తిన్నపాములాగా నెమ్మదిగా..

అలాంటి స్లాత్స్ కనిపించడమే అరుదవుతుండగా దానితో నికోలస్ హుస్కార్ అనే ఓ యువకుడు ఏకంగా సెల్ఫీనే దిగాడు. ఆ ఫోటోకు స్లాత్ కూడా చక్కగా నవ్వుతూ పోజిచ్చింది. వాస్తవానికి ఈ జంతువు కెమెరాకు చిక్కడం చాలా అరుదు. ఓ అడవిలో ట్రెక్కింగ్ కు వెళుతున్న నికోలస్ తనకు స్లాత్ కనిపించగానే వెంటనే తన సెల్ఫీ స్టిక్ తీస్కొని ఫొటోకు పోజివ్వగా.. అది చూసిన స్లాత్ కూడా నేను కూడా రెడీ అన్నట్లు స్మైల్ తో పోజిచ్చింది. ఈ ఫొటోను ఆన్ లైన్ లో పోస్ట్ చేయగా దుమ్మురేపుతోంది. ఇప్పటికే రెండు లక్షలమంది ఆ ఫొటోను చూశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement