అక్కడ వితంతువులే ఉండరు! | There are no widows in this tribal belt of Madhya Pradesh | Sakshi
Sakshi News home page

అక్కడ వితంతువులే ఉండరు!

May 10 2016 11:21 AM | Updated on Oct 8 2018 3:17 PM

అక్కడ వితంతువులే ఉండరు! - Sakshi

అక్కడ వితంతువులే ఉండరు!

కుటుంబంలోని మహిళకు భర్త చనిపోతే ఆమె జీవితాంతం వితంతువుగా ఉండాల్సిన అవసరం వారి తెగల్లో ఉండదు. భర్త చనిపోయిన పదోరోజు పెళ్ళికాని ఏ యువకుడైనా తిరిగి ఆమెను పెళ్ళి చేసుకునే అవకాశం ఉంటుంది. వారి సంప్రదాయం ప్రకారం భర్త కావడానికి మనుమడుకి కూడ అర్హత ఉంటుంది.

బెహంగాః  ప్రాంతాన్నిబట్టి గిరిజన తెగల్లో ఆచారాలు, సంప్రదాయాలు కొనసాగుతుంటాయి.  అయితే మధ్యప్రదేశ్ లోని గోండ్ల లో కనిపించే సంప్రదాయం మాత్రం విభిన్నంగా కనిపిస్తుంది. కుటుంబంలోని మహిళకు భర్త చనిపోతే ఆమె జీవితాంతం వితంతువుగా ఉండాల్సిన అవసరం వారి తెగల్లో ఉండదు. భర్త చనిపోయిన పదోరోజు కుటుంబంలోని పెళ్ళికాని ఏ యువకుడైనా తిరిగి ఆమెను పెళ్ళి చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు వారి సంప్రదాయం ప్రకారం భర్త కావడానికి  మనుమడుకి కూడ అర్హత ఉంటుంది.

మధ్యప్రదేశ్ మండ్లా జిల్లాలోని గోండ్లలో కనిపించే ప్రత్యేక సంప్రదాయంతో, వారి తెగల్లో మహిళలు వితంతువులుగా మిగిలిపోయే అవకాశం ఉండదు. భర్త చనిపోయిన పది రోజుల్లోగా ఆ మహిళను వారి కుటుంబంలోని పెళ్ళికాని ఏ యువకుడైనా తిరిగి వివాహమాడొచ్చు. కనీసం ఆమెకు మనుమడు వరుస అయ్యే వాడు కూడ నాయనమ్మను, లేదా అమ్మమ్మను పెళ్ళి చేసుకునేందుకు అర్హత ఉంటుంది. ఒకవేళ కుటుంబ సభ్యుల్లో ఎవ్వరూ లేనప్పుడు, లేదా అలా చేసుకునేందుకు ఇష్టపడని పక్షంలో, భర్త చనిపోయిన పది రోజులకు.. ఆమెకు సంఘంలోని పెద్దలు ప్రత్యేకంగా వెండి గాలులు చేయిస్తారు. పదో రోజు అనంతరం ఆ గాజులను ఆమెకు ఎవరు అందిస్తే వారిని పెళ్ళి చేసుకునే అవకాశం ఉంటుంది.  ఆ సంప్రదాయాన్ని 'పోటో' గా పిలుస్తారు. ఇదే నేపథ్యంలో 'పటిరం వర్కేడ్' పెళ్ళి కూడ జరిగింది. అతడికి ఆరేళ్ళ వయసున్నపుడు అతడి తాత మరణించడంతో తొమ్మిదవరోజున పటిరం.. 'నాటి పాటో' సంప్రదాయంలో భాగంగా  తన నాయనమ్మ చమ్రీబాయ్ ని పెళ్ళి చేసుకున్నాడు. అలా సంప్రదాయ బద్ధంగా ఆ వితంతు మహిళకు పెళ్ళి అయితే... తిరిగి ఆ దంపతులు... భార్యాభర్తలుగా సంఘంలో జరిగే అన్ని కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. నేను ఇతర అమ్మాయినే పెళ్ళి చేసుకుందాం అనుకున్నానని, అయితే తమ సంప్రదాయంలో భాగంగా, కుల పెద్దల నిర్ణయంతో మైనర్లు పెద్ద వారిని చేసుకునే అవకాశం ఉండటంతో తన నాయనమ్మను పెళ్ళి చేసుకొన్నానని బెహంగా గ్రామంలో నివసించే 42 రెండేళ్ళ పటిరం చెప్తున్నాడు. అయితే ఐదేళ్ళ క్రితం తన నాయనమ్మ మరణించే వరకూ తన భార్య రెండో భార్య హోదాలో కొనసాగేదని వివరించాడు.   

గోండ్ల ప్రత్యేక సంప్రదాయంలో జీవిత భాగస్వాముల మధ్య తీవ్ర వయోబేధం ఉన్నపుడు ఎటువంటి భౌతిక సంబంధాలు ఉండవు. అయితే సంఘంలో వారు గౌరవ మర్యాదలను పొందేందుకు, సాన్నిహిత్యంతో ఉండేందుకు ఈ ప్రత్యేక సంస్రదాయం సహకరిస్తుంది. 75 ఏళ్ళ సుందరో బాయి కుర్వాతి కూడ పెళ్ళయిన రెండేళ్ళకే తన భర్త చనిపోవడంతో 'దేవర్ పాటో' సంప్రదాయంలో భాగంగా  అప్పట్లో ప్రస్తుతం 65 ఏళ్ళున్న తన మరిదిని వివాహమాడింది. భర్త చనిపోయిన సమయంలో అతడు తనను పెళ్ళాడేందుకు ఇష్టాన్ని చూపించలేదని, దాంతో తనను సంఘ పెద్దలు శుభకార్యాలకు అనుమతించే వారు కాదని, అనంతరం రెండేళ్ళ తర్వాత అతడు నన్ను పెళ్ళాడటంతో పెద్దలు  తిరిగి అన్నికార్యాలకూ హాజరయ్యేందుకు  అంగీకరించారని, అప్పట్నుంచీ దశాబ్దాల కాలంగా తాము ఎంతో సంతోషంగా ఉన్నామని సుందరో బాయి చెప్తోంది. అలాగే తనకంటే ఐదేళ్ళు పెద్దదైన వదినగారిని పెళ్ళాడానని 55 ఏళ్ళ కృపాల్ సింగ్ చెప్తున్నారు. అయితే కొందరు మహిళలు భర్త చనిపోయినప్పటికీ, తిరిగి వివాహం చేసుకోకుండానే వితంతువుగా కాక వివాహితగా కొనసాగేందుకు పెద్దలనుంచి అనుమతి తీసుకుంటారు. అటువంటి వారిలో 28ఏళ్ళ భాగ్వతి ఒకరు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భర్త చనిపోవడంతో ఆమె తిరిగి వివాహం చేసుకునేందుకు అంగీకరించలేదు. పాంచ్ పటో సంప్రదాయంలో భాగంగా ఆమె వివాహితగా కొనసాగేందుకు సంఘ పెద్దలనుంచి అనుమతి తీసుకుంది. ఎంత పెద్ద చదువులు చదువుకున్నా గోండ్లు తమ సంప్రదాయాలు పాటిస్తారని, ఒక్క తమ గ్రామంలోనే కాక, భోపాల్ లోని భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ కంపెనీలో పనిచేస్తున్నఇద్దరు ఇంజనీర్లు సైతం తమ దేవర్ పాటో సంప్రదాయం ప్రకారం పెళ్ళిళ్ళు చేసుకున్నారని ట్రైబల్ లీడర్ గుల్జార్ సింగ్ మర్కమ్ తెలిపారు. ఈ వివాహ వ్యవస్థ  మా సంస్కృతిలో భాగమని, నాటీ పాటో వివాహంలో నాయనమ్మను పెళ్ళి చేసుకున్న పిల్లలు ఆమెతో ఆడుకోవడం కనిపించడం సాధారణమని గుల్జార్ తెలిపారు. అయితే నాటి పాటోలో నాయనమ్మను పెళ్ళాడిన మనుమడే కుటుంబ పెద్దగా ఉంటాడని వివరించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement