మానవత్వం మనిషి రూపులో.. | The man in the form of humanity | Sakshi
Sakshi News home page

మానవత్వం మనిషి రూపులో..

May 30 2016 4:04 AM | Updated on Sep 4 2017 1:12 AM

మానవత్వం మనిషి రూపులో..

మానవత్వం మనిషి రూపులో..

ఆయనేమీ ధనవంతుడు కాదు.. 15 ఏళ్ల వయసులో పొట్టకూటి కోసం పాకిస్తాన్‌నుంచి వలస వచ్చిన కాందిశీకుడు.. జీవన పోరాటంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని చివరకు అహ్మదాబాద్

60 ఏళ్లలో 550 అనాథ శవాలకు దహన సంస్కారాలు జరిపిన మిథాలాల్

అహ్మదాబాద్: ఆయనేమీ ధనవంతుడు కాదు.. 15 ఏళ్ల వయసులో పొట్టకూటి కోసం పాకిస్తాన్‌నుంచి వలస వచ్చిన కాందిశీకుడు.. జీవన పోరాటంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని చివరకు అహ్మదాబాద్ వీధుల్లో రిక్షాపై తిరుగుతూ ముత్యాల హారాలు అమ్మే వీధి వ్యాపారిగా స్థిరపడ్డాడు.  అయితేనేం మూర్తీభవించిన మానవత్వానికి తాను ప్రతిరూపమని నిరూపించుకున్నాడు మిథాలాల్ సింధీ. నా అనేవారు ఎవరూ లేని అనాథ శవాలకు అన్నీ తానై దహన సంస్కారాలు జరిపిస్తుంటాడు. ఇలా ఆరు దశాబ్దాల కాలంలో 550 అనాథ శవాలకు దహన సంస్కారాలు జరిపించాడు.

ఫుట్‌పాత్‌పై తన సహచరుడు మరణించినప్పుడు దహన సంస్కారాలకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రారంభమైన ఈ సేవ.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ‘ అనాథ శవం ఉందని సమాచారం రాగానే అక్కడికి చేరుకొని ఆ వ్యక్తి శరీరంపై మతపరమైన ఆనవాల్లేమైనా ఉన్నాయేమో పరిశీలిస్తాను. ఏ మతస్తుడో తెలిస్తే ఆ మతపరమైన విధానంలో అంత్యక్రియలు నిర్వహిస్తాను’ అని మిథాలాల్ చెబుతున్నాడు. ఒక్కో శవం అంత్యక్రియలకూ మిథాలాల్‌కు కనీసం రూ. 15 వందలు ఖర్చవుతుంది. ముత్యాల హారాలు అమ్ముతూ సమకూర్చుకున్న మొత్తాన్నే అందుకు వినియోగిస్తుంటాడు. 83 ఏళ్ల మిథాలాల్ గత 60 ఏళ్లుగా ఫుట్‌పాత్‌పైనే జీవిస్తున్నాడు. తాను చేసే పనిలో పూర్తి సంతృప్తిగా ఉన్నానని, భగవంతుడు తనను ఇందుకోసమే పుట్టించాడని చెబుతూ ఉంటాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement