జమాతే ముజాహిదీన్ ఉగ్రవాది అరెస్ట్ | terrorist Jamaat Mujahideen arrested | Sakshi
Sakshi News home page

జమాతే ముజాహిదీన్ ఉగ్రవాది అరెస్ట్

Jan 29 2015 9:35 PM | Updated on Sep 2 2017 8:29 PM

జమాతే ముజాహిదీన్ బంగ్లాదేశ్ అనే మిలిటెంట్ సంస్థకు చెందిన ఉగ్రవాదిని దావణగెరె జిల్లా హొన్నాళి పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.

సాక్షి, బళ్లారి : జమాతే ముజాహిదీన్ బంగ్లాదేశ్ అనే మిలిటెంట్ సంస్థకు చెందిన ఉగ్రవాదిని దావణగెరె జిల్లా హొన్నాళి పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఇతను పశ్చిమ బెంగాల్, అసోంలలో జరిగిన బాంబు పేలుడు ఘటనలకు బాధ్యుడిగా అనుమానిస్తున్నారు. ఇతడిని పల్‌బూర్ హుసేన్(28)గా గుర్తించారు.

అస్సాంలోని బక్సా జిల్లా పోకలగి గ్రామానికి చెందిన ఇతను అక్కడి పోలీసుల మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నట్లు వెల్లడైంది. రెండేళ్లుగా ఇతను హొన్నాళి తాలూకా కత్తిగె గ్రామ సమీపంలోని ఓ క్రషర్ యూనిట్‌లో లారీ డ్రైవర్‌గాపని చేస్తున్నాడని తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement