గార్డును కొట్టి.. తాళాలు లాక్కొని.. | Ten juveniles escape from MP remand home after beating guard | Sakshi
Sakshi News home page

గార్డును కొట్టి.. తాళాలు లాక్కొని..

Dec 12 2016 11:39 AM | Updated on Sep 4 2017 10:33 PM

గార్డును కొట్టి.. తాళాలు లాక్కొని..

గార్డును కొట్టి.. తాళాలు లాక్కొని..

మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది.

జబల్‌పూర్‌: వివిధ కేసుల్లో రిమాండ్‌లో ఉన్న పది మంది బాలనేరస్తులు జువెనైల్‌ హోం నుంచి పరారైన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో జువెనైల్‌ హోంకు గార్డుగా ఉన్న వ్యక్తిని తీవ్రంగా కొట్టి బాలనేరస్తులు పరారయ్యారు.

రాంజీ పోలీస్‌ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గార్డును తీవ్రంగా కొట్టి తాళాలు లాక్కొని.. పది మంది బాల నేరస్తులు పరారయ్యారని రిమాండ్‌ హోం అధికారి పునిత్‌ వర్మ వెల్లడించారు. పరారైన వారికోసం గాలింపు చేపడుతున్నామని రాంజీ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ సంజయ్‌ శుక్లా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement