సహజీవనంతో పుట్టిన పిల్లలు అక్రమ సంతానం కాదు: సుప్రీం | Symbiosis is is not illegitimate children: Supreme Court | Sakshi
Sakshi News home page

సహజీవనంతో పుట్టిన పిల్లలు అక్రమ సంతానం కాదు: సుప్రీం

Apr 25 2014 2:14 AM | Updated on Sep 2 2018 5:20 PM

సహజీవనంతో పుట్టిన పిల్లలు అక్రమ సంతానం కాదు: సుప్రీం - Sakshi

సహజీవనంతో పుట్టిన పిల్లలు అక్రమ సంతానం కాదు: సుప్రీం

ఓ పురుషుడు, ఓ మహిళ దీర్ఘకాలం పాటు భార్యాభర్తల మాదిరి కలిసి జీవించడం వల్ల పుట్టిన పిల్లలను అక్రమ సంతానంగా పిలవరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిం ది.

న్యూఢిల్లీ: ఓ పురుషుడు, ఓ మహిళ దీర్ఘకాలం పాటు భార్యాభర్తల మాదిరి కలిసి జీవించడం వల్ల పుట్టిన పిల్లలను అక్రమ సంతానంగా పిలవరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిం ది. సహజీవన సంబంధాలపై మద్రాసు హైకో ర్టు ఇచ్చిన తీర్పులోని కొన్ని అంశాలను సవాల్ చేస్తూ ఉదయ్‌గుప్తా అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ నేపథ్యంలో.. న్యాయమూర్తులు బి.ఎస్.చౌహాన్, జె.చలమేశ్వర్‌లు గురువారం ఈ స్పష్టత ఇచ్చారు. చట్టబద్దమైన వివాహమంటే.. సాధారణంగా పెళ్లైన జంటకు ఉండే సంప్రదాయపరమైన హక్కులన్నిటినీ తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదన్న హైకోర్టు అభిప్రాయం చట్టరీత్యా సమర్థనీయం కాదని పేర్కొంటూ ఉదయ్ గుప్తా ఈ పిటిషన్ దాఖలు చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement