బీజేపీ, టీడీపీల పై శారదాపఠాధిపతి స్వరూపానంద స్వామి మండిపడ్డారు.
ఢిల్లీ: బీజేపీ, టీడీపీల పై శారదాపఠాధిపతి స్వరూపానంద స్వామి మండిపడ్డారు. గోహత్యలను అడ్డుకోవడంలో బీజేపీ విఫలమయిందని ధ్వజమెత్తారు. రామ మందిర నిర్మాణంలో అడుగు కూడా ముందుకు పడలేదన్నారు.
ఏపీలో దేవాలయ భూములు అన్యాక్రాంతమవుతున్నాయన్నారు. టీడీపీ నేతలు, ప్రభుత్వం దేవాలయ భూములతో వ్యాపారం చేస్తున్నారని స్వరూపానంద స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.