అక్టోబర్ 2లోగా రాజకీయ పార్టీని ప్రారంభిస్తామని స్వరాజ్ అభియాన్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
న్యూఢిల్లీ: అక్టోబర్ 2లోగా రాజకీయ పార్టీని ప్రారంభిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) బహిష్కృత ఆప్ నేతలు, స్వరాజ్ అభియాన్ సంస్థ ప్రతినిధులు యోగేశ్ యాదవ్, ప్రశాంత్ భూషణ్ తెలిపారు. తమ పార్టీలో ఆప్ తరహాలో కేంద్రీకృత నాయకత్వ వ్యవస్థ ఉండదని, పూర్తి పారదర్శకతతో పార్టీ కార్యకలాపాలను నిర్వహిస్తామని చెప్పారు.
ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పార్టీని ప్రారంభిస్తున్నామన్నారు. అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై వీరు స్పష్టతనివ్వలేదు.