దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో చేపట్టే భద్రతా చర్యల్లో సీఐఎస్‌ఎఫ్ సమూల మార్పులు చేసింది.
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో చేపట్టే భద్రతా చర్యల్లో సీఐఎస్‌ఎఫ్ సమూల మార్పులు చేసింది. ఇప్పటివరకూ అమలు చేస్తున్న ప్రయాణికుల సాధారణ తనిఖీల స్థానంలో వ్యూహాత్మక తనిఖీ పద్ధతులను అవలంబించనుంది.
ప్రయాణికుల టికెట్ వివరాల ఆరాకు ఎక్కువ సమయం పడుతుండటంతో ఇకపై అనుమానాస్పద ప్రయాణికులపై నిఘా పెట్టేలా సిబ్బందిని సాధారణ దుస్తుల్లో ఎయిర్‌పోర్టు టెర్మినళ్లలో మోహరించనుంది. పాకిస్థాన్‌లోని కరాచీ ఎయిర్‌పోర్టుపై ఉగ్ర దాడుల నేపథ్యంలో సీఐఎస్‌ఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది.