ఇంటర్‌నెట్‌ సేవల పునరుద్ధణకు సుప్రీం ఆదేశాలు

Supreme court Directs Govt To Restore Internet In Jammu Kashmir - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్‌లో ఇంటర్‌నెట్‌పై నిషేధం, భద్రతా పరమైన ఆంక్షలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఇంటర్‌నెట్‌ నిలిపివేయడం రాజ్యాంగ విరుద్ధమని సర్వోన్నత న్యాయస్ధానం పేర్కొంది. ఆర్టికల్‌ 19లో ఇది ఓ భాగమని వ్యాఖ్యానిస్తూ ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్ని అత్యవసర సేవలకు ఇంటర్‌నెట్‌ను పునరుద్ధరించాలని ఆదేశించింది. జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కుల మధ్య సమతుల్యం అవసరమని జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. ఇంటర్‌నెట్‌ నిషేధంపై వారంలోగా సమీక్షించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ వెబ్‌సైట్లు, ఈ బ్యాంకింగ్‌, నిత్యావసవర సేవలకు ఇంటర్‌నెట్‌ అందుబాటులో ఉంచాలని, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇంటర్‌నెట్‌పై ఆంక్షలు విధించాలని పేర్కొంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top