కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు: సుజనా | sujana chowdary slams congress party over praivate bill in rajya sabha | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు: సుజనా

Jul 22 2016 3:45 PM | Updated on Mar 29 2019 9:31 PM

కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు: సుజనా - Sakshi

కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు: సుజనా

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదాపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్నారు.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ ప్రైవేట్ బిల్లు ఓటింగ్కు రాకపోవడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమన్నారు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎంపీలు విమర్శలు మాని హోదా కోసం పోరాడాలని సూచించారు. సోమవారం నుంచి సభ జరగకుండా అడ్డుకోవాలని ఆయన అన్నారు.

కాగా ఉద్దేశ్య పూర్వకంగానే రాజ్యసభలో ప్రైవేటు బిల్లును అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి కుట్ర పన్నాయని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు అన్నారు. లోక్ సభలో ఆప్ సభ్యుడు వ్యవహారాన్ని రాజ్యసభలో చర్చకు తేవడం ఎంత వరకూ సమంజసమని ఆయన ప్రశ్నించారు. బిల్లుకు ఆమోదింబడే మెజార్టీ కాంగ్రెస్కు ఉందనే భయంతోనే బీజేపీ భగవంత్ వ్యవహారాన్ని సాకుగా చూపుతూ ఆందోళనకు దిగిందని రుద్రరాజు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement