మందలించిన ఉపాధ్యాయుడికి విద్యార్థి కత్తిపోట్లు! | Student stabs teacher | Sakshi
Sakshi News home page

మందలించిన ఉపాధ్యాయుడికి విద్యార్థి కత్తిపోట్లు!

Feb 12 2015 8:28 PM | Updated on Nov 9 2018 4:59 PM

పాఠశాల పరిసరాల్లో మద్యం సేవించవద్దని మందలించినందుకు ఓ విద్యార్థి ఉపాధ్యాయుడిని కత్తితో పొడిచాడు.

ఇంఫాల్: తప్పు చేస్తున్న విద్యార్థిని మందలించిన ఉపాధ్యాయుడు కత్తి పోట్లకు గురయ్యాడు. పాఠశాల పరిసరాల్లో మద్యం సేవించవద్దని గట్టిగా చెప్పినందుకు ఓ విద్యార్థి ఉపాధ్యాయుడిని కత్తితో అయిదు పోట్లు పొడిచాడు. ఇక్కడి జవహర్ నవోదయ విద్యాలయంలో ఈ ఘటన జరిగింది. 12వ తరగతి విద్యార్థి స్కూల్ పరిసరాల్లో మద్యం సేవిస్తుండగా ఓ ఉపాధ్యాయుడు అతడిని మందలించాడు. దాంతో ఆగ్రహించిన విద్యార్థి గురువుని కత్తితో ఐదుసార్లు పొడిచాడని పోలీసులు తెలిపారు.

ఉపాధ్యాయుడి పరిస్థితి విషమంగా ఉంది. అతడిని ఇన్టెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచినట్లు వైద్యులు తెలిపారు. అయితే విద్యార్థిని గుర్తించినప్పటికీ, పోలీసులు అతని పేరు బయట పెట్టలేదు. పొడిచిన అనంతరం విద్యార్థి తప్పించుకొనిపోయాడు. విద్యార్థిని పట్టుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement