రేషన్‌ సరుకుల్ని డోర్‌ డెలివరీ చేయండి

Start home delivery of rations to curb starvation deaths - Sakshi

రాష్ట్రాలకు కేంద్ర మంత్రి సూచన  

న్యూఢిల్లీ: దేశంలో ఆకలి చావులను అరికట్టేందుకు వీలుగా అన్ని రాష్ట్రాలు రేషన్‌ సరుకుల్ని లబ్ధిదారుల ఇంటికి చేరవేయాలని కేంద్రం కోరింది. అలాగే వరుసగా మూడు నెలలపాటు రేషన్‌ సరుకుల్ని తీసుకెళ్లని వారిపై దృష్టి సారించాలని సూచించింది. ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టం చేయడంపై పాశ్వాన్‌ అధ్యక్షతన శుక్రవారం నాడిక్కడ జరిగిన సమావేశానికి 15 రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశం అనంతరం పాశ్వాన్‌ మీడియాతో మాట్లాడారు. ‘వైకల్యం, ముసలితనం కారణంగా రేషన్‌షాపుకు లబ్ధిదారులు రాలేని సందర్భాల్లో రాష్ట్రాలు వారి ఇంటికి రేషన్‌ సరుకుల్ని చేరవేయాలి’ అని తెలిపారు. ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టతలోభాగంగా ఆన్‌లైన్‌లో ఫిర్యాదుచేసే సదుపాయం, టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్లు వంటి సంస్కరణలను వేగవంతం చేయాలని రాష్ట్రాలను కోరారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top