
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయ తాండవం సృష్టిస్తోంది. మహమ్మారి ఉధృతికి అడ్డుకట్ట పడడం లేదు. కరోనా సంబంధిత మరణాలు, పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. కరోనాపై కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. (లాక్‌డౌన్ 4.0: భారీ ఆర్థిక ప్యాకేజీ)
గత 24 గంటల్లో 3,525 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 122 మంది మృతి చెందారని పేర్కొంది. దేశంలో మొత్తం కేసులు 74281కు చేరుకున్నాయి. ఇప్పటివరకు 24,386 మంది డిశ్చార్జ్ అవ్వగా, 2415 మంది మృతి చెందారని తెలిపింది. దేశంలో ప్రస్తుతం 47,480 యాక్టివ్ కేసులున్నాయని వెల్లడించింది.(పట్టాలెక్కిన రైళ్లు.. ప్రయాణానికి రెడీనా!)