ఇక ‘సోషల్‌ మీడియా హబ్‌’! | Social Media Hub | Sakshi
Sakshi News home page

ఇక ‘సోషల్‌ మీడియా హబ్‌’!

Jan 29 2018 3:18 AM | Updated on Oct 22 2018 6:05 PM

Social Media Hub - Sakshi

న్యూఢిల్లీ: కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకాల అమలు, జిల్లాలో ట్రెండింగ్‌ సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా ‘సోషల్‌ మీడియా కమ్యూనికేషన్‌ హబ్‌’ను ప్రారంభించనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ తెలిపింది. ఈ ప్రాజెక్టులో భాగంగా సమాచార సేకరణకు ప్రతి జిల్లాలో మీడియా ప్రతినిధుల్ని కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తామని వెల్లడించింది.

వీరు ఆయా జిల్లాల్లో జరిగే సంఘటనలతో పాటు కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల అమలుపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటారని పేర్కొంది. ఈ సమాచారాన్ని విశ్లేషించడానికి కేంద్ర స్థాయిలో నిపుణుల్ని నియమిస్తామంది. ఈ ప్రాజెక్టు ఇంగ్లిష్, హిందీ, తెలుగు, బెంగాలి, తమిళ్, కన్నడ సహా పలు భాషల్ని సపోర్ట్‌ చేస్తుందనీ.. దీంతో అన్ని సామాజిక మాధ్యమాలు, డిజిటల్‌ మీడియాల్లోని సమాచారాన్ని సేకరించవచ్చంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement