
వెనుకంజలో కిరణ్ బేడీ
ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ వెనుకంజలో కొనసాగుతున్నారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ వెనుకంజలో కొనసాగుతున్నారు. కృష్ణా నగర్ నుంచి పోటీకి దిగిన కిరణ్ బేడీ.. తొలుత ఆధిక్యం దిశగా కొనసాగినా తరువాత అనూహ్యంగా వెనుకబడ్డారు.
ఇక్కడ ఆప్ అభ్యర్థి ఎస్ కే బగ్గా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఢిల్లీలో అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉన్న ఆప్ విజయం దిశగా పయనిస్తోంది. ఇదిలా ఉండగా సదర్ బజార్ లో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ మాకెన్ వెనుకంజలో ఉన్నారు. ఆప్ అభ్యర్థి సోమ్ దత్ ముందంజలో కొనసాగుతుండగా, సమీప కాంగ్రెస్ అభ్యర్థి మాకెన్ మాత్రం వెనుకబడ్డారు.