ప్రకాష్‌ రాజ్‌ హత్యకు కుట్ర | SIT Reveals Plan To Kill Prakash Raj | Sakshi
Sakshi News home page

ప్రకాష్‌ రాజ్‌ హత్యకు కుట్ర

Jun 27 2018 4:26 PM | Updated on Jul 30 2018 9:15 PM

SIT Reveals Plan To Kill Prakash Raj - Sakshi

ప్రకాష్‌ రాజ్‌ (పాత ఫొటో)

సాక్షి, హైదరాబాద్‌ : సినీ నటుడు, దర్శకుడు ప్రకాష్‌ రాజ్‌ను హత్య చేసేందుకు భారీ కుట్ర జరిగినట్లు గౌరీ లంకేష్‌ కేసును విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(ఎస్‌ఐటీ) వెల్లడించింది. ఈ మేరకు కన్నడ మీడియాలో బుధవారం కథనాలు వచ్చాయి. వాటిపై స్పందించిన ప్రకాష్‌ రాజ్‌ ట్వీట్‌ చేశారు. ఇలాంటి కథనాలను చూసి తాను ఎంతమాత్రం బెదిరిపోనని, భవిష్యత్‌లో మరింత దూకుడు పెంచి విద్వేషపూరిత రాజకీయాలపై పోరాడతానని ఆయన పేర్కొన్నారు.

కాగా, గౌరీ లంకేష్‌ హత్య కేసులో పలువురు రాజకీయ నాయకుల హస్తం ఉందని ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ గతంలో ఆరోపణలు చేశారు. గౌరీ లంకేష్‌ తనకు మంచి స్నేహితురాలని ప్రకాశ్‌రాజ్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె నిజాయతీగా ఉండేవారని, తన హత్య చాలా బాధించిందని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement