పాట పాడలేదని కాల్చేశాడు.. | singer in UP shot dead for refusing to perform song Ballia | Sakshi
Sakshi News home page

పాట పాడలేదని కాల్చేశాడు..

Apr 23 2015 1:35 PM | Updated on Sep 3 2017 12:45 AM

పాట పాడలేదని కాల్చేశాడు..

పాట పాడలేదని కాల్చేశాడు..

ఆర్కెస్ట్రా కార్యక్రమంలో కోరిన పాట పాడలేదని గాయకురాలిని తుపాకీతో కాల్చి చంపిన సంఘటన వెలుగుచూసింది

ఉత్తర్ప్రదేశ్ (బలియా): ఆర్కెస్ట్రా కార్యక్రమంలో కోరిన పాట పాడలేదని గాయకురాలిని తుపాకీతో కాల్చి చంపిన సంఘటన వెలుగుచూసింది. పశ్చిమబెంగాల్ లోని చౌబీస్ పరగణకి చెందిన పియూ (23) అనే  ఆర్కెస్ట్రా గాయకురాలు బలియాలోని దయా చాప్రా గ్రామంలో ఓ వివాహ కార్యక్రమంలో పాడేందుకు వచ్చింది. అయితే అభిమానులు కోరిన పాటని పాడడానికి ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన బబ్లూ కుమార్ సింగ్ అనే వ్యక్తి గురువారం తెల్లవారుజామున ఆమెను తుపాకీతో కాల్చి చంపాడని ఏఎస్పీ కేసీ గోస్వామీ తెలిపారు. నిందుతుడు బబ్లూ సింగ్ ని అదుపులోకి తీసుకున్నామని, పియూ మృత దేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్టు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement