కాల్పుల ఘటన తెలిసి షాకయ్యాను: సుష్మా | Shocked at shooting incident in Kansas in which Srinivas Kuchibhotla has been killed:sushma swaraj | Sakshi
Sakshi News home page

కాల్పుల ఘటన తెలిసి షాకయ్యాను: సుష్మా

Feb 24 2017 10:04 AM | Updated on Sep 5 2017 4:30 AM

కాల్పుల ఘటన తెలిసి షాకయ్యాను: సుష్మా

కాల్పుల ఘటన తెలిసి షాకయ్యాను: సుష్మా

అమెరికాలో జాత్యహంకార దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు ప్రాంతానికి చెందిన శ్రీనివాస్‌ కూచిబొట్ల మృతిపట్ల కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

న్యూఢిల్లీ: అమెరికాలో జాత్యహంకార దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు ప్రాంతానికి చెందిన శ్రీనివాస్‌ కూచిబొట్ల మృతిపట్ల కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను ఎంతో కలిచివేసిందని విచారం వ్యక్తం చేశారు. అతడి కుటుంబం ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన అలోక్‌ మాదసాని ఆస్పత్రి నుంచి ఇంకా డి‌శ్చార్జి అవ్వాల్సి ఉందని అక్కడి భారత రాయబారి తెలిపినట్లు సుష్మా చెప్పారు.

గాయపడిన అలోక్‌కు సహాయం చేసేందుకు కాన్సుల్‌ ఆర్డీ జోషి, వైస్‌ కాన్సుల్‌ హర్పాల్‌ సింగ్‌ కాన్సాస్‌కు బయలుదేరినట్లు తెలిపారు. ఘటన పూర్తి వివరాలు తెలుసుకున్నానని, శ్రీనివాస్‌ మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆమె భరోసా ఇచ్చారు. జాత్యహంకారంతో ఓ తెల్లజాతి దుండగుడు జరిపిన కాల్పుల్లో శ్రీనివాస్‌ కూచిబోట్ల అనే తెలుగు యువకుడు చనిపోగా.. అలోక్‌ మాదసాని అనే మరో యువకుడు గాయపడ్డాడు. 

సంబంధిత వార్తా కథనాలకై చదవండి..

శ్రీనివాస్‌ మృతిపట్ల యూఎస్‌ కంపెనీ తీవ్ర దిగ్భ్రాంతి

అమెరికాలో జాతి విద్వేష కాల్పులు


శ్రీనివాస్‌ కుటుంబానికి ఎన్‌ఆర్‌ఐల బాసట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement