సునంద హత్య కేసులో థరూర్కు నోటీసు | Shashi Tharoor gets police notice, asked to join Sunanda murder probe | Sakshi
Sakshi News home page

సునంద హత్య కేసులో థరూర్కు నోటీసు

Jan 19 2015 6:56 PM | Updated on Aug 21 2018 8:06 PM

సునంద హత్య కేసులో థరూర్కు నోటీసు - Sakshi

సునంద హత్య కేసులో థరూర్కు నోటీసు

కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునందా పుష్కర్ హత్య కేసులో ఢిల్లీ పోలీసులకు ఆయనకు నోటీసు పంపారు.

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునందా పుష్కర్ హత్య కేసులో ఢిల్లీ పోలీసులకు ఆయనకు నోటీసు పంపారు. కేసు విచారణకు హాజరుకావాల్సిందిగా శశి థరూర్కు సూచించారు. రెండ్రోజుల్లో ఆయన్ను ప్రశ్నించే అవకాశముందని ఢిల్లీ పోలీస్ చీఫ్ బస్సీ చెప్పారు. శశి థరూర్ సోమవారం ఢిల్లీ వచ్చారు.

సునంద హత్య కేసులో ప్రత్యేక విచారణ బృందం ఇప్పటికే పలువురిని ప్రశ్నించిందని, మరికొందర్ని విచారించాల్సి ఉందని పోలీస్ కమిషనర్ తెలిపారు. గతేడాది జనవరి 17న ఢిల్లీలోని ఓ హోటల్లో సునంద అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement