సెక్స్ ముఠాను పట్టించిన విద్యార్థినులు | Schoolchildren help Darjeeling police bust international sex racket | Sakshi
Sakshi News home page

సెక్స్ ముఠాను పట్టించిన విద్యార్థినులు

Jun 19 2016 6:19 PM | Updated on Sep 15 2018 7:22 PM

అంతర్జాతీయ సెక్స్ రాకెట్ ను డార్జింలింగ్ పోలీసులకు పట్టించేందుకు ఓ పాఠాశాల విద్యార్థులు సాయం అందించారు.

అంతర్జాతీయ సెక్స్ రాకెట్ ను డార్జింలింగ్ పోలీసులకు పట్టించేందుకు ఓ పాఠాశాల విద్యార్థులు సాయం అందించారు. డిల్లీ కేంద్రంగా  చేసిన ఈ ఆపరేషన్ ‘కింగ్ పిన్‘ పేరుతో అమ్మాయిలను అక్రమంగా విదేశాలకు తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నేపాల్-పశ్చిమ బెంగాల్ బోర్డర్లో ముగ్గురు ట్రాఫికర్స్ ను అరెస్టు చేయగా.. డార్జిలింగ్ లో నుంచి ఢిల్లీ బయలుదేరిన మరో టీమ్ రాకెట్ లో ఉన్న మిగతా వారిని అరెస్టు చేశారు.

డార్జిలింగ్ లో ఓ పదిహేనేళ్ల బాలిక కొద్ది రోజులుగా కనిపించకుండా పోవడంతో విచారణ ప్రారంభించిన పోలీసులు తీగ లాగడంతో అంతర్జాతీయ రాకెట్ గురించిన వివరాలు బయటపడ్డాయి. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం డార్జిలింగ్, సిక్కిం, నేపాల్ ల నుంచి ముఠా ఉద్యోగం పేరుతో బీదరికంలో ఉన్న అమ్మాయిలకు అక్రమంగా ఆధార్ కార్డులను సృష్టించి నేషనల్ కాపిటల్ రీజియన్(ఎన్సీఆర్)లోని బార్ లలో డాన్సర్లుగా మారుస్తూ వారి రక్తమాంసాలతో వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. దీంతో నిందితులు వర్మ, సున్నీలను అరెస్టు చేయడానికి వెళ్లగా వారు నేపాల్ వైపు రోడ్డు మీదుగా తప్పించుకు పారిపోయినట్లు వివరించారు.

అక్కడి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారిని పట్టుకున్నట్లు చెప్పారు. డార్జిలింగ్ లో అమ్మాయిల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అక్కడ పనిచేసే 12 మంది అమ్మాయిలతో కూడిన పాఠశాల ఎన్జీవో బృందం నిందితులను పట్టుకోవడంలో సాయపడినట్లు  తెలిపారు. గిరిజన అమ్మాయిల్లా వీరు ముఠా వద్ద నటించి వారిని బురిడీకొట్టించారని వివరించారు. వారితో పాటు బార్లలో పనిచేయడానికి ఇల్లు వదిలేసి ఢిల్లీ వచ్చినట్లు వారిని మొదట నమ్మించారని చెప్పారు. ఆ తర్వాత 15,000వేల జీతానికి బార్ లో డాన్స్ చేయడానికి కావలసిన డాక్యుమెంట్లు లేవని చెప్పడంతో నిందితులు 20 నిమిషాల్లో ఆధార్ కార్డులను సృష్టించి పంపినట్లు తెలిపారు. మొదట ఓ వ్యక్తి, మహిళ ఢిల్లీలోని పనిటంకీ వద్దకు వీరిని తీసుకువెళ్లడానికి వచ్చారని వీరిని పట్టుకుని సమాచారం సేకరించినట్లు చెప్పారు. ఆ సమాచారంతో అసలు ముఠా హెడ్ ను నేపాల్ బోర్డర్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement