
ప్రైవేట్ స్కూల్లో ప్రిన్సిపాల్ అరాచకం
త్రిపురలో ఓ ప్రైవేట్ రెసిడెన్సియల్ పాఠశాల ప్రిన్సిపాల్ (36) అభంశుభం తెలియని విద్యార్ధిని (9)పై లైంగికదాడికి పాల్పడ్డాడు.
అగర్తలా: త్రిపురలో ఓ ప్రైవేట్ రెసిడెన్సియల్ పాఠశాల ప్రిన్సిపాల్ (36) అభంశుభం తెలియని విద్యార్ధిని (9)పై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం నిందితుడిని అరెస్ట్ చేశారు.
కాంచన్పూర్లో ఓ ప్రైవేట్ స్కూలు ఆవరణంలో ప్రిన్సిపాల్ తన ఇంట్లో గతేడాది అక్టోబర్ నుంచి విద్యార్థినిని పలుమారు అత్యాచారం చేసినట్టు ఎస్పీ ఉత్తమ్ కుమార్ భౌమిక్ చెప్పారు. ఇటీవల వేసవి సెలవులకు ఇంటికి వెళ్లిన చిన్నారి జరిగిన విషయం తల్లికి చెప్పి, మళ్లీ స్కూలుకు వెళ్లనని మొరపెట్టుకుంది. బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుడి దగ్గర బాధిత చిన్నారి నగ్న చిత్రాలు, వీడియోలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.