శారద స్కామ్‌లో రూ. 60 కోట్ల ఆస్తులు అటాచ్! | Saradha scam: ED attaches assets worth Rs 60 cr | Sakshi
Sakshi News home page

శారద స్కామ్‌లో రూ. 60 కోట్ల ఆస్తులు అటాచ్!

Oct 29 2014 7:58 PM | Updated on Sep 27 2018 5:03 PM

సుదిప్తా సేన్ - Sakshi

సుదిప్తా సేన్

శారద చిట్ ఫండ్ స్కామ్ కేసులో భాగంగా బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) సుమారు 60 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్‌మెంట్ చేసింది.

న్యూఢిల్లీ:  శారద చిట్ ఫండ్ స్కామ్ కేసులో భాగంగా బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) సుమారు 60 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్‌మెంట్ చేసింది. ఇందులో పశ్చిమబెంగాల్‌లోని లింకన్ హైస్కూలు, లాండ్‌మార్క్ సిమెంట్ పరిశ్రమ, పలు ఫ్లాట్‌లు, రిసార్ట్‌లు ఉన్నట్టు తెలిసింది.

శారదా గ్రూప్ చిట్ఫండ్ కంపెనీ చైర్మన్ సుదిప్తా సేన్, అతని బినామీ ఆస్తులను అటాచ్ చేశారు. మరోవైపు ఈ స్కామ్‌కు సంబంధించి ముంబైలో సెబీకి చెందిన పలువురు సీనియర్ అధికారులను సీబీఐ బుధవారం ప్రశ్నించింది.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement