‘ఇప్పుడు ఓడినా మళ్లీ గెలుస్తాం’

Salman Khurshid Lashes Out At Those Giving Cong Unsolicited Advice - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక సమరంలో ఓటమిపాలైన కాంగ్రెస్‌ నేతలకు ఉచిత సలహాలు ఇస్తున్న వారిపై ఆ పార్టీ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ మండిపడ్డారు. అవన్నీ తాము గతంలో గెలిచిన స్ధానాలేనని..తమ వారసులు భవిష్యత్‌లో గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

 తమ ఓటమిపై సంబరాలు చేసుకోవద్దని..కసితో తమ పోరాటం కొనసాగిస్తామని..ఈ క్రమంలో తాము విజయవంతం కాకుంటే భవిష్యత్‌లో విజయాలకు బాటలు వేస్తామని కపిల్‌ సిబల్‌ ట్వీట్‌ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించి సొంతంగా 303 స్ధానాలను గెలుపొందిన సంగతి తెలిసిందే. విపక్ష కాంగ్రెస్‌ కేవలం 52 స్ధానాలకే పరిమితమైంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top