అతడిని పట్టిస్తే 10 లక్షలిస్తా.. | Rs. 10 Lakhs Offer to Find Burhan, 21, Who is All Over Social Media | Sakshi
Sakshi News home page

అతడిని పట్టిస్తే 10 లక్షలిస్తా..

Aug 18 2015 8:56 AM | Updated on Sep 3 2017 7:40 AM

అతడిని పట్టిస్తే 10 లక్షలిస్తా..

అతడిని పట్టిస్తే 10 లక్షలిస్తా..

కశ్మీర్ యువకుడు బుర్హాన్ ముజఫర్ ను పట్టుకునేందుకు ఓ టెర్రరిస్టు గ్రూపు హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ చేసిన ప్రయత్నం సంచలనం సృష్టిస్తోంది.

కశ్మీర్ యువకుడు బుర్హాన్ ముజఫర్ ను పట్టుకునేందుకు ఓ టెర్రరిస్టు గ్రూపు హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ చేసిన ప్రయత్నం సంచలనం సృష్టిస్తోంది. కశ్మీర్ కు చెందిన ఓ యువకుడిని ఉగ్రసంస్థలోకి చేర్చుకోవడాన్ని సోషల్ మీడియాలో భాగమైన ఫేస్ బుక్, వాట్సాప్ లలో ఆ వీడియోను ముజఫర్ ఆప్ లోడ్ చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం ఇంటర్ నెట్లో హల్ చల్ చేస్తుంది. తన ఉగ్రవాద కార్యకలాపాల నేపథ్యంలో పోలీసులకు ఆధారమైన ఆ వీడియోను అప్ లోడ్ చేసిన ముజఫర్ ను పట్టిస్తే రూ.10 లక్షలు ఇస్తానంటూ ఆ కమాండర్ ప్రకటించేశాడు. బుర్హాన్ ముజఫర్ వాణి దక్షిణ కశ్మీర్ లోని సంపన్న కుటాంబానికి చెందిన ఓ యువకుడు. అయితే 2010లో తన సోదరుడిని ఆర్మీ బలగాలు చంపాయన్న కారణంగా 15 ఏళ్ల వయసులోనే ఉగ్రవాద గ్రూపులో చేరిపోయాడు.

ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బుర్హాన్ ముజఫర్ మిలిటెంట్ల ఫొటోలను ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశాడు. బుర్హాన్ తన ప్రసంగాలతో యువకులను మిలిటెంట్లుగా మారేందుకు ఉత్తేజ పరిచేవాడని సమాచారం. త్రాల్ అడవుల్లో బుర్హాన్ ను కలిసేందుకు యత్నించిన ముజాహిద్దీన్ సంస్థ కమాండర్ సోదరుడు ఆర్మీ కాల్పుల్లో ఈ ఏడాది మరణించిన విషయం తెలిసిందే. గత ఆరు నెలల్లో సుమారు 60 మంది యువకులను మిలిటెంట్లుగా మార్చాడని బుర్హాన్ పై ఆరోపణలున్నాయని ఓ పోలీస్ అధికారి తెలిపారు. బుర్హాన్ చర్యల వల్ల దక్షిణ కశ్మీర్ ఏరియాలో భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయని కూడా వారు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement