మోదీపై రవీనాటాండన్ ప్రశంసలు | Raveena Tandon praises Modi's cleanliness drive | Sakshi
Sakshi News home page

మోదీపై రవీనాటాండన్ ప్రశంసలు

Oct 20 2014 8:26 AM | Updated on Aug 15 2018 2:20 PM

మోదీపై రవీనాటాండన్ ప్రశంసలు - Sakshi

మోదీపై రవీనాటాండన్ ప్రశంసలు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన 'స్వచ్ఛభారత్' కార్యక్రమంపై బాలీవుడ్ నటి రవీనా టాండన్ ప్రశంసలు కురిపించింది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన 'స్వచ్ఛభారత్' కార్యక్రమంపై బాలీవుడ్ నటి రవీనా టాండన్ ప్రశంసలు కురిపించింది. ప్రతి ఒక్కరూ ఈ బృహత్ కార్యక్రమానికి తమ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆమె పిలుపునిచ్చింది. మన ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్లే, దేశాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత దేశవాసులు అందరిమీదా ఉందని తెలిపింది.

ఉత్తరప్రదేశ్లోని మథురలో ఓ నగల దుకాణాన్ని ప్రారంభించిన తర్వాత రవీనా విలేకరులతో మాట్లాడింది. శ్రీకృష్ణుడి నగరం అంటే తనకు ఎంతో ఇష్టమని ఆమె చెప్పింది. జమ్ము కాశ్మీర్లో వరదలతో బాధపడుతున్నవారిని ఆదుకోడానికి ఉదారంగా విరాళాలు ఇవ్వాలని కూడా ప్రజలకు రవీనా పిలుపునిచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement