అత్యాచారం కేసులో సీనియర్ ఐపీఎస్పై విచారణ | Rape-accused IPS officer quizzed by cops | Sakshi
Sakshi News home page

అత్యాచారం కేసులో సీనియర్ ఐపీఎస్పై విచారణ

Jul 28 2014 8:39 PM | Updated on Oct 8 2018 6:18 PM

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ పరస్కార్ను విచారించారు.

ముంబై: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ పరస్కార్ను విచారించారు. సోమవారం ఆయనను దాదాపు నాలుగు గంటల పాటు ప్రశ్నించినట్టు పోలీసులు తెలిపారు.

ముంబై పోలీస్ హెడ్క్వార్టర్స్కు సునీల్ను పిలిపించుకుని డిప్యూటీ పోలీస్ కమిషనర్ (క్రైమ్) శరద్ రౌత్, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కలా గావిట్ విచారించారు. ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అవసరమైతే ఆయనను మళ్లీ ప్రశ్నిస్తామని సీనియర్ పోలీస్ అధికారులు తెలిపారు. ఓ మోడల్ తనను సునీల్ అత్యాచారం చేశాడని కేసు దాఖలు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement