రాజధాని, శతాబ్ది రైలు చార్జీల పెంపు | Rajdhani, Shatabdi train fares hiked | Sakshi
Sakshi News home page

రాజధాని, శతాబ్ది రైలు చార్జీల పెంపు

Oct 12 2013 1:22 AM | Updated on Apr 7 2019 3:24 PM

ప్యాసింజర్ రైళ్ల చార్జీలు ఇటీవలే పెంచిన రైల్వే శాఖ.. రాజధాని, శతాబ్ది, దురంతో లాంటి ప్రీమియర్ రైళ్ల చార్జీలను కూడా పెంచాలని నిర్ణయించింది. ఈ నెల 17 నుంచి పెంపు అమల్లోకి రానుంది.

న్యూఢిల్లీ: ప్యాసింజర్ రైళ్ల చార్జీలు ఇటీవలే పెంచిన రైల్వే శాఖ.. రాజధాని, శతాబ్ది, దురంతో లాంటి ప్రీమియర్ రైళ్ల చార్జీలను కూడా పెంచాలని నిర్ణయించింది. ఈ నెల 17 నుంచి పెంపు అమల్లోకి రానుంది. ఈ రైళ్ల టికెట్ చార్జీలు రూ.20 నుంచి రూ.50 వరకు పెరిగే అవకాశముందని రైల్వే శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. వాస్తవానికి రైలు టికెట్ చార్జీ ఏమాత్రం పెంచలేదని, ఆహార పదార్థాల ధరలు పెంచేసరికి అది మొత్తం టికెట్ ధరలో పెంపుగా కనిపిస్తోందని ఆయన అన్నారు. ఈ ప్రీమియర్ రైళ్లలో ఆహార పదార్థాల చార్జీని కూడా టికెట్ ధరలోనే కలిపి వసూలు చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement