రైల్వే ప్రాజెక్టుల భాగస్వామ్యానికి రాష్ట్రాలు ఓకే | Rail projects worth over Rs 60000 crore with state participation | Sakshi
Sakshi News home page

రైల్వే ప్రాజెక్టుల భాగస్వామ్యానికి రాష్ట్రాలు ఓకే

Dec 5 2016 8:26 PM | Updated on Sep 4 2017 9:59 PM

కొత్త లైన్ల ఏర్పాటు, స్టేషన్ల అభివృద్ధిలో రాష్ట్రాలు పాలు పంచుకోవాలని రైల్వే శాఖ చేసిన విజ్ఞప్తికి ఆంధ్రప్రదేశ్‌ సహా 16 రాష్ట్రాలు అంగీకరించాయి.

న్యూఢిల్లీ: కొత్త లైన్ల ఏర్పాటు, స్టేషన్ల అభివృద్ధిలో రాష్ట్రాలు పాలు పంచుకోవాలని రైల్వే శాఖ చేసిన విజ్ఞప్తికి ఆంధ్రప్రదేశ్‌ సహా 16 రాష్ట్రాలు అంగీకరించాయి. దాదాపు రూ.62,379 కోట్ల ఖర్చుతో కూడుకున్న 43 రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకు రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంలో పాలు పంచుకోవాలని రైల్వే శాఖ మంత్రి సురేష్‌ ప్రభు అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారని, ఇందుకుగాను 16 రాష్ట్రాలు ఒప్పుకున్నాయని రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రాజెక్టుల మొత్తం వ్యయంలో 25 నుంచి 66 శాతం వరకు రాష్ట్రాలు భరించనున్నాయని ఆయన చెప్పారు.

ప్రాజెక్టుల కోసం ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఉచితంగా స్థలాలను ఇస్తున్నాయని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం స్టేషన్ల అభివృద్ధి, కొత్త లైన్ల ఏర్పాటు, లైన్ల డబ్లింగ్‌ పనులు వంటి వాటిపై రైల్వే శాఖ దృష్టి సారించిందని ఆయన అన్నారు. ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హరియాణా, కేరళ, ఒడిశా రాష్ట్రాలు జాయింట్‌ వెంచర్‌ ఒప్పందంపై సంతకాలు చేశాయని ఆయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలు కూడా జాయింట్‌ వెంచర్‌ కంపెనీలను ఏర్పాటు చేయడానికి అంగీకరించాయని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement