కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే మృతికి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు.
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే మృతికి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఉంచిన ముండే భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
రాహుల్ వెంట ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ ఉన్నారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడుతో రాహుల్ కాపేపు మాట్లాడారు. మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముండే మరణించారు.