
సాక్షి, న్యూఢిల్లీ : మార్షల్ ఆర్ట్స్‌లో ఒకటైన అయికిడో విద్య తనకు వచ్చని.. అందులోతనకు బ్లాక్‌బెల్ట్ ఉందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. అంతేకాక వ్యాయామం శారీరక దారుఢ్యానికేగాక, మానసిక వికాసానికి కూడా ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. గురువారం పీహెచ్‌డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వార్షిక సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే రాహుల్ గాంధీ తనకు అయికిడో వచ్చని ప్రకటించారు. అంతేకాక తాను రోజు ఉదయాన్నే గంట సేపు ఈత కొట్టడం, రన్నింగ్ వంటివి చేస్తానని ఆయన తెలిపారు. అయితే ఈ విషయాలను పబ్లిసిటీ కోసం ఎన్నడూ చెప్పుకోలేదని అన్నారు. శారీరక వ్యాయామాలను సోషల్ మీడియాలో పెట్టాలని కొందరు రాహుల్ గాంధీని కోరడంతో.. అందుకు ఆయన అంగీకరించారు.