'కాంగ్రెస్ బాగుపడాలంటే ఆయన మారాలి' | Rahul Gandhi Likes Servant-Master Relationship, says Himanta Biswa Sarma | Sakshi
Sakshi News home page

'కాంగ్రెస్ బాగుపడాలంటే ఆయన మారాలి'

May 20 2016 8:57 AM | Updated on Sep 4 2017 12:32 AM

'కాంగ్రెస్ బాగుపడాలంటే ఆయన మారాలి'

'కాంగ్రెస్ బాగుపడాలంటే ఆయన మారాలి'

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి బాగా అహం అని అసోంలో బీజేపీ విజయానికి కీలకంగా పనిచేసిన ఒకప్పటిక కాంగ్రెస్ నేత హిమంత్ బిస్వా శర్మ అన్నారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి బాగా అహం అని అసోంలో బీజేపీ విజయానికి కీలకంగా పనిచేసిన ఒకప్పటిక కాంగ్రెస్ నేత హిమంత్ బిస్వా శర్మ అన్నారు. తన చుట్టూఉన్న మనుషులను అస్సలు పట్టించుకోడని ఏదైన చెప్పేందుకు ప్రయత్నిస్తుంటే 'సో వాట్.. సోవాట్' అంటూ అంటారని ఆయన అన్నారు. రాష్ట్రంలో పార్టీ దిగజారిందని ఇలాగే ఉంటే కనీసం 25సీట్లు కూడా ఈసారి దాటకపోవచ్చని తాను ఒక పక్క చెబుతుండగా ఆయన మాత్రం తన మాటలు పట్టించుకోకుండా కుక్క పిల్లలతో ఆడుకోవడం ప్రారంభించారని చెప్పారు.

రాహుల్.. యజమాని-సేవకుడు విధానాన్ని అనుసరిస్తారని చెప్పారు. ఆరోజు తాను చెప్పిన మాటలు విని ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బాగుపడాలంటే.. రాహుల్ అయినా మారాలి లేదంటే కాంగ్రెస్ పార్టీ అన్నా అతడిని మార్చాలి అని ఆయన అన్నారు. ఈశాన్య రాష్ట్రలన్నింటిలో అసోం పెద్ద రాష్ట్రంగా ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ పదిహేనేళ్లు వరుసగా అధికారంలో ఉన్న పార్టీ అనూహ్యంగా ఓటమిని చవిచూసింది. హిమంత్ బిస్వా ఒకప్పుడు కాంగ్రెస్ నేత. రాహుల్ తీరుతో విసుగు చెందిన ఆయన 2015లో బీజేపీలో చేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement