కొత్త రాజకీయాలను ప్రారంభిద్దాం

Priyanka Gandhi will first come to Uttar Pradesh on Monday - Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రియాంక గాంధీ తొలిసారిగా ఉత్తరప్రదేశ్‌కు సోమవారం రానున్నారు. ఈ విషయాన్ని ఆమె ఆదివారం వెల్లడిస్తూ, యూపీ ప్రజలతో కలిసి కొత్త రకం రాజకీయాలను ప్రారంభిస్తానన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఉత్తరప్రదేశ్‌ తూర్పు భాగానికి ప్రియాంకను, పశ్చిమ భాగానికి జ్యోతిరాదిత్య సింధియాను ఇన్‌చార్జ్‌లుగా కాంగ్రెస్‌ గత నెలలో నియమించడం తెలిసిందే. వీరిద్దరితోపాటు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కూడా సోమవారం లక్నోకు రానున్నారు. లక్నో విమానాశ్రయం నుంచి పార్టీ కార్యాలయం వరకు వీరు ముగ్గురూ కలిసి ప్రయాణించే సమయంలో రోడ్‌ షో ఏర్పాటుకు కార్యకర్తలు యోచిస్తున్నారు.    

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top